నల్లగొండ : నల్లగొండలో ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. నల్లగొండలోని ఐటీ టవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ నుంచి దిల్‌సుక్‌నగర్ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఆపలేదని డ్రైవర్ పై సదరు వ్యక్తి పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో డ్రైవర్ రామ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడు నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.