హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): బస్సు ఆలస్యమవుతుందని ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలో ఆదివారం బస్సు పక్కన పెట్టి డ్రైవర్ రాములు, కండక్టర్‌తో కలిసి భోజనానికి వెళ్లాడు. ఇదే సమయంలో వచ్చిన ప్రయాణికుడు నవాజ్ బస్సు ఇంకెప్పుడు బయలుదేరుతుందని వారిని ప్రశ్నించాడు.
భోజనం చేసి వచ్చి బస్సును ఫ్లాట్‌ఫాం మీదికి తీసుకొస్తామని డ్రైవర్ రాములు చెప్పాడు. అయినా నవాజ్ బస్సు ఆలస్యమవుతుందని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. ఈ ఘటనను ఖండిస్తూ మిగతా డ్రైవర్లు సోమవారం డిపోలో నిరసన తెలిపారు. వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్,కండక్టర్ కలిసి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే పోలీస్‌శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు. నిందితులపై చట్టప్రకారం ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని ట్వీట్ చేశారు.