న్యూఢిల్లీ: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఆయన 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం జర్మనీకి భారత రాయబారిగా పని చేస్తున్నారు. జీ20, జీ7, బ్రిక్స్ సమావేశాల్లో కీలక పాత్ర పోషించారు. ఉప రాష్ట్రపతికి ఓఎస్డీగా కూడా పని చేశారు. రుచిర కాంభోజ్ జూన్‌లో పదవీ విరమణ చేయడంతో హరీశ్‌ను ఈ పదవిలో నియమించారు. రుచిర దాదాపు నాలుగు దశాబ్దాలపాటు దౌత్యవేత్తగా పని చేశారు. పర్వతనేని హరీశ్ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. గోల్డ్ మెడల్ కూడా పొందారు.