పర్వతగిరి, ఆగస్టు 2: వరంగల్ జి ల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న, డ్రైవర్ సదానందం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పర్వతగిరి మండలం అన్నారం శివారు పెద్ద తండా గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి ధరావత్ భాస్కర్‌కు ఓ క్రిమినల్ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై రూ. 70 వేల లంచం డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో భాస్కర్ ఏసీబీ అధికారులకు సమాచార మందించాడు. అంతకుముందే వేరే వ్యక్తి ద్వారా రూ. 20 వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నారు. శుక్రవారం రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై వెంకన్నతోపాటు డ్రైవర్ సదానందంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.