కొత్తూరు, జూలై 13: సీఎం రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ నాయకులు నుంచే మద్దతు కరు వవుతున్నది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మం డలం సిద్ధాపూర్లో 84 ఎకరాల్లో డంపిం గ్యార్డు ఏర్పాటు చేస్తామంటూ తెచ్చిన 641 జీవోపై అధికార పార్టీ నాయకులు నుంచే తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఆర్డీవోకు వినతిప్రతం ఇస్తామంటూ సోమవారం సిద్ధ్దాపూర్ నుంచి బయలుదేరిన నియోజకర్గ నాయకులు పెంజర్ల వద్ద నేషనల్ హైవే-44పై బైఠాయించి సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. మహిళలు పెద్దఎత్తు న రావడం, తగినంత మహిళా సిబ్బంది లేక పోలీసులు వారిని అక్కడినుంచి పంపించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు చెదరగొట్టగా, వై జంక్షన్ వద్ద రాస్తారోకో చేశారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుచె ప్పడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.
రేవంత్‌కు మంచిబుద్ధి ప్రసాదించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి మంచిబుద్ధి ప్రసాదిం చి జీవోను రద్దు చేసేలా చూడాలని ఆ దేవున్ని వేడుకుంటున్నాం. ఎంతో కష్టపడి సీఎం చేస్తే మా మండలానికి చెత్తకుప్పను బహుమతిగా ఇస్తానంటున్నాడు. జీవో రద్దు చేయకపోతే రాజీనామా చేసి ఉద్యమం చేపడుతాం.
– శేఖర్‌రెడ్డి, కొత్తూరు మండల అధ్యక్షుడు