హైదరాబాద్ జూన్ 3 (నమస్తేతెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్వగ్రా మం ఇనుగుర్తిలో హరీశ్‌రావు జన్మదినాన్ని వేడుకగా నిర్వహించారు. వద్దిరాజు తన తల్లిదండ్రుల స్మతివనంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి కేక్ కట్ చేశారు. హరీశ్ నివాసంలో సోమవారం రాత్రి కర్నా టి విద్యాసాగర్, మేడె రాజీవ్‌సాగర్, ధర్మేందర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మఠం భిక్షపతి హరీశ్‌రావుతో కేక్ కట్ చేయించారు.
పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నేత రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ప్రవా స తెలంగాణావాసుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ యూకే మెంబర్షిప్ విభా గం కో ఆర్డినేటర్ అంజన్‌రావు అధ్యక్షతన కేక్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటరమణ ఒడిశాలోని పూరి బీచ్‌లో హరీశ్‌రావు సైకత శిల్పం రూపొందించి శుభాకాంక్షలు చెప్పి అభిమానాన్ని చాటుకున్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్, కేటీఆర్‌కు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.