హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అగ్రిఫుడ్ వ్యవస్థల్లో మహిళలు, చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలపై ఐక్యరాజ్యసమితి అధ్యయనం చేపట్టనున్నది. ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ ఆర్మి డా సల్సియాహ్ బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. భేటీలో టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ అఖిల్, లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల మూడో దశలో భాగంగా తెలంగాణలో 31 స్టేషన్లు ఏర్పాటు కానున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండ, రామగుండం, సూర్యాపేట జిల్లాలకు మూడు చొప్పున రేడియో చానల్స్, నిజామాబాద్ జిల్లాకు 4 చానల్స్ కేటాయించారని పేర్కొన్నారు.