హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): పార్లమెంటరీ కమిటీ ఆన్ కామర్స్ ఈనెల 18న హైదరాబాద్లో పర్యటించనున్నది. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని 30 మంది ఎంపీలు, కేంద్ర వాణిజ్యశాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధ్యయనం చేయనున్నది. శాసనసభ కమిటీ హాలులో సభా సంఘం సమావేశాన్ని కూడా నిర్వహించనున్నది.