హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాల్సిందేనని, లేకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ స్పష్టం చేసింది. ఢిల్లీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌ను సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పరుశురామ్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. అంబేదర్పై ఏ మాత్రం గౌరవమున్నా నూతన పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలని, కరెన్సీపైనా అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.