హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలోని 3వ అధికరణ కల్పించిన హక్కుల మేరకు తెలంగాణ ఉద్యమం సాగిందని వివరించారు. కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతుందని వెల్లడించారు.