హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ సహా విపక్షాలు చేసిన నినాదాలతో బుధవారం ఉభయ సభలు కొన్ని నిమిషాల పాటే సాగాయి. ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో నిమిషంలోపే సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా గందరగోళ వాతావరణం ఉండటంతో ఏప్రిల్ 3కు సభను వాయిదా వేశారు. దీంతో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు.