Brain dead | మరణిస్తూ మరో ముగ్గురికి ప్రాణదానం.. కొడుకు అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు
Brain dead | పట్టుమని 24 ఏండ్లు కూడా నిండలేదు. అప్పుడే ఆ యువకుడిని డెంగీ జ్వరం రూపంలో మృ త్యువు కబళించింది. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు ఔదార్యం చూపారు.
- డెంగీతో యువకుడి బ్రెయిన్ డెడ్
శంకరపట్నం, మార్చి 12 : పట్టుమని 24 ఏండ్లు కూడా నిండలేదు. అప్పుడే ఆ యువకుడిని డెంగీ జ్వరం రూపంలో మృ త్యువు కబళించింది. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. తమ కొడుకు అవయవాలు దానం చేసి మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు. వివరాలిలా.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంకు చెందిన గాజుల శ్రీనివాస్-రమాదేవి దంపతుల చిన్న కొడుకు నందన్ (24)కు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో తల్లిదండ్రులు సికింద్రాబాద్ యశోద దవాఖానలో చేర్పించారు. 19 రోజులపాటు క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి మెరుగైన వైద్యం అందించినా ఫలితం దక్కకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇదే సమయంలో జీవన్‌దాన్ సంస్థ ఆ తల్లిదండ్రులకు అవయవ దానం పై అవగాహన కల్పించడంతో తమ కొడుకు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో వైద్యులు కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించారు. ఆ తర్వాత దవాఖాన వైద్యులు, నర్సులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది మృతదేహం వద్ద గౌరవ వందనం సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

