హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఇంట్లో పిల్లలను కొట్టడం, వేధించడం, చిన్నబుచ్చడం వారిని అభద్రతకు గురిచేస్తుందని, ఇలా చేయడం మానుకోవాలని విద్యాశాఖ తల్లిదండ్రులకు సూచించనుంది. 25న రాష్ట్రంలోని సర్కారు బడుల్లో పేరెంట్ టీచర్ సమావేశాలను నిర్వహించనుంది. ‘పిల్లల భద్రతను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర’ అన్న థీమ్పై సమావేశాన్ని నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. పిల్లలు ఆటలాడటం, తగినంత విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించాలని సూచనలివ్వనున్నారు.