పీఎస్‌యూల పరిరక్షణ పోరులో దివ్యాంగుడు!
దీరావత్ మహేశ్‌నాయక్..! ఇతను దివ్యాంగుడు. అయితేనేం ఒంటి చేత్తోనే క్రికెట్ బంతిని బౌండరీలు దాటిస్తాడు. వాలీబాల్ ఆటలోనూ రాణిస్తున్నాడు.
- రాజ్యంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ
- అమ్మేవాళ్లను నమ్మొద్దు: క్రికెటర్ మహేశ్‌నాయక్ పిలుపు
- హరితహారం, హెల్మెట్లు, చేనేత వస్ర్తాలపై ప్రచారం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): దీరావత్ మహేశ్‌నాయక్..! ఇతను దివ్యాంగుడు. అయితేనేం ఒంటి చేత్తోనే క్రికెట్ బంతిని బౌండరీలు దాటిస్తాడు. వాలీబాల్ ఆటలోనూ రాణిస్తున్నాడు. శామీర్‌పేట పరిధిలోని లింగాపూర్ తండాకు చెందిన మహేశ్‌నాయక్ ఆటల్లోనూ కాదు సామాజిక స్పృహను ప్రదర్శించడంలోనూ, సాహసోపేత కార్యక్రమాలు చేపట్టడంలోనూ అతనికి అతడే సాటి.
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా ఆయన రాకను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్ వద్ద ఒక్కడే ధైర్యంగా నిలబడి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువురి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా శనివారం హైదరాబాద్ మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన 73వ రాజ్యాగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) పరిరక్షణ ఉద్యమంతో గొంతు కలిపాడు. పీఎస్‌యూలను అమ్మేవాళ్లను నమ్మొద్దని నినదించాడు.
ప్రజలను మతం ప్రాతిపదికన విభజించే వాళ్లకు ఓట్లు వేయవద్దంటూ అక్కడ ఉన్నవారితో ప్రతిజ్ఞ చేయించాడు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలకు మద్దతుగా ఒంటి చేత్తోనే బైక్ నడుపుతూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుదామంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఎందుకు ధరించాలో వివరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించాడు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత వస్ర్తాలు ధరించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గతంలో హైదరాబాద్‌లో ప్రచారం చేశాడు. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు తదితర నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతుగా బైక్‌కు ఫ్లెక్సీలు కట్టుకుని ప్రచారంలో పాల్గొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

