తిర్యాణి, ఫిబ్రవరి 2: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇర్కపల్లిలో చిరుతపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం రాత్రి చింతపల్లి ప్రాంతంలో చిరుత చెట్టు ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తిర్యాణి ఎఫ్ఆర్వో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకపుగూడ, ఇర్కపల్లి, చింతపల్లి, సమీప గ్రామాల్లో గాలింపు చేపట్టారు. సమీపంలోని గురుకుల పాఠశాలకు 2 కిలోమీటర్ల దూరంలో చిరుత పాదముద్రలు గుర్తించారు. ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.