యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ప్రధానార్చక బృందం పంచకుండాత్మక మహా యాగాన్ని వైభవంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు శాంతిపారం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమధనం, అగ్ని ప్రతిష్ట, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్యలఘుపూర్ణాహుతి చేపట్టనున్నారు. సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, నిత్యవిశేష హోమములు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం నిత్య లఘుపూర్ణాహుతిని చేపట్టనున్నారు. ఈ ఉదయం నిర్వహించిన పంచకుండాత్మక మహా యాగంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి.. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.