Telangana | హైదరాబాద్, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో పురుషులు 82,04,518 మంది, స్త్రీలు 85,28,573, ట్రాన్స్జెండర్లు 493 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 538 మండలాల్లోని 12,867 గ్రామ పంచాయతీల్లో 1,13,722 వార్డుల్లో ఉన్న ఓటరు జాబితాలను అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ ఓటరు జాబితా ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వార్డుల సంఖ్యను తెలుకపోవడంతో మరో 40 గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ప్రకటించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా పంచాయతీలు, వార్డులు, ఓటర్ల సంఖ్యా పరంగా నల్లగొండ, సంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు ముందుండగా, హన్మకొండ, ములుగు, మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.