మద్దూరు (ధూళిమిట్ట), జూన్16: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లిలో సర్కార్ బడులను పరిరక్షించుకునేందుకు గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కార్ బడులకు పిల్లలను పంపిస్తే ఇంటి, నల్లా పన్నులను మినహాయిస్తామని సర్పంచ్ బర్మ రాజమల్లయ్య గ్రామస్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
‘మన ఊరు-మన బడి’ స్ఫూర్తితో గ్రామంలోని పాఠశాలలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించిన వారికి ఇంటి, నల్లా పన్నులను మినహాయిస్తున్నట్టు వెల్లడించారు.