రఘునాథపల్లి, జూలై 9: బిల్లులు మంజూరు చేసేందుకు తాజా మాజీ సర్పంచ్ వద్ద లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి తాజా మాజీ సర్పంచ్ గవ్వాని విజయ-నాగేశ్వర్రావు గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు.
తమకు రావాల్సిన రూ.1.5 లక్షలకు బిల్లులు చేయాలని పంచాయతీ కార్యదర్శి శివాజీని కలిశారు. అందుకు ఆయన రూ.20 వేలు డిమాండ్ చేశాడు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నాగేశ్వర్రావు నుంచి కార్యదర్శి శివాజీ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.