సుబేదారి, నవంబర్ 28: పంచాయతీరాజ్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం మాజీ సర్పంచ్ మంద సంపత్ ఏడాదిన్నర క్రితం రూ.10 లక్షల పీఆర్ నిధులతో సీసీ రోడ్డు పనులు చేశారు. బిల్లుల కోసం వరంగల్ జిల్లా పీఆర్ డిపార్ట్మెంట్ డ్రాయింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏఈ గాదె కార్తీక్‌ను సంప్రదించగా రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు.
గురువారం హనుమకొండలోని హరిత హోటల్లో ఏఈ కార్తీక్ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వరంగల్ జడ్పీ కార్యాలయంలోని డ్రాయింగ్ గదికి తీసుకువెళ్లి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.