అల్లాదుర్గం, మార్చి 26: జీపీ కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు వేతనం రాక ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా అల్లాదుర్గంకు చెందిన బోయిని కుమార్ (28) గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సకాలంలో వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడగా ఈ నెల 21న అర్ధరాత్రి తన ఇంటిలో క్రిమిసంహారకమందు తాగాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం చెందాడు. మృతుడి సోదరుడు బోయిని పోచయ్య ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.