Kethaki Temple | ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.. వీరశైవ లింగాయత్ సమాజ్ డిమాండ్
Kethaki Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ఛైర్మెన్ చంద్రశేఖర్‌తో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఝరాసంగం మండల వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రవిపాటిల్ డిమాండ్ చేశారు.
ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ఛైర్మెన్ చంద్రశేఖర్‌తో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఝరాసంగం మండల వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రవిపాటిల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయంలో కొంతమంది అనధికారిక పూజారులు ఆలయ నిబంధనలు పాటించకుండా భక్తులతో పూజలు చేయించి అందిన కాడికి దండుకుంటున్నారన్న విషయం ఛైర్మన్ దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఈ విషయంపై ఛైర్మన్ ఆరా తీస్తుంటే ఓ అనధికారిక పూజారి అడ్డగోలుగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించాడని, ఇది హేయమైన చర్య అని పాటిల్ అన్నారు. ఆలయ ఈవో సమక్షంలో అడ్డగోలుగా మాట్లాడితే కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా హాస్యాస్పదమని విమర్శించారు. ఇకపైన ప్రతి పూజ రసీదు రూపంలోనే జరగాలని రవిపాటిల్ సూచించారు.
సంబందిత ఎండోమెంట్ అధికారులు విచారణచేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతమైతే వీరశైవ లింగాయత్ సమాజ్ సహించదని హెచ్చరించారు. ఆయనతోపాటు మండల ప్రధాన కార్యదర్శి ఆండ్ర సంతోష్, కేతకి పాలక మండలి సభ్యులు మల్లికార్జున్ పాటిల్, శివ కుమార్, రాజు, బస్వరాజ్, రుద్రప్ప, బస్వరాజ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

