HomeTelanganaPanchayat Elections Will Conduct In Three Phases In Telangana
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
రాష్ట్రంలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
సెప్టెంబర్ 6 నుంచి ఓటరు అభ్యంతరాల స్వీకరణ
అదే నెల 21న తుది ఓటరు జాబితా ప్రకటన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
సెప్టెంబర్ 6న ఓటరు జాబితా ముసాయిదా నోటిఫికేషన్‌ను వెలువరించి అభ్యంతరాలను స్వీకరించాలని, సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు.
వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. తొలుత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు, చివరగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఒకో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఒక వార్డులోని ఓటరుకు మరో వార్డు పరిధిలో ఓటు హకు ఉండకుండా జాగ్రత్త వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల ఓట్లు ఒకేచోట ఉండేలా జాబితాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా ‘గ్రీవెన్స్ మాడ్యూల్’ను పార్థసారథి ఆవిషరించారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, ఎన్నికల సంఘం అధికారులు పాల్గొన్నారు.