హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో విధి విధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయసు 21 ఏండ్లకు తక్కువగా ఉండరాదు. అభ్యర్థులు అదే గ్రామం లో ఓటరుగా నమోదై ఉండాలి. ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో ఉద్యోగి పోటీ చేయాలంటే నామినేషన్‌కు ముందే రాజీనామా ఆమోదం పొం దాలి.
రేషన్‌డీలర్లు అర్హులు కాగా, అంగన్వాడీ టీచర్లు, మతిస్థిమితం లేనివారు అనర్హులు. ఒకవ్యక్తి గరిష్ట ంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చు. వార్డు స్థానానికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీల నామినేషన్ రుసుం రూ.250, ఇతరులు రూ. 500 చెల్లించాలని, సర్పంచ్ అభ్యర్థులైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1000, ఇతరులు రూ.2,000 చెల్లించాలి. ఒ కవ్యక్తి క్రిమినల్ కోర్టు ద్వారా దోషిగా నిర్ధారణ అయితే ఐదేండ్ల వరకు పోటీ చేయడానికి అనర్హుడవుతారు.