హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ పథకం కింద ఈసారి ఫాం, ఫిష్పాండ్స్, పంచాయ తీ, అంగన్వాడీ, మహిళా భవనాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్ర ణాళికలు రూపొందించాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం తన చాంబర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దని మంత్రి సీతక్క ఆదేశించారు.
అధికారులంతా నిబద్ధతతో, అంకితభావంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు. వివిధ సమస్యలతో అధికారుల వద్దకు ప్ర జలను పదేపదే తిప్పించుకోకుండా మండల స్థాయిలోనే వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హ యాంలో సుమారు 800 కోట్ల పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సిబ్బందికి 2 నెలల వేతనాల కోసం 46 కోట్లను మంత్రి విడుదల చేయించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.