హైదరాబాద్, అక్టోబర్30 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరో ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ అడ్మినిస్టేషన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్‌గా, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న అభిషేక్ మహంతిని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.