హరితహారంలో తాటి, ఈత, గిరక మొక్కలు
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘాలు సామాజిక బాధ్యతగా ప్రతి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో విరివిగా తాటి, ఈత, గిరక మొక్కలను నాటాలని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో
ప్రభుత్వ స్థలాల్లో విస్తృతంగా నాటాలి
ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపు
హైదరాబాద్, జులై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘాలు సామాజిక బాధ్యతగా ప్రతి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో విరివిగా తాటి, ఈత, గిరక మొక్కలను నాటాలని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో రాష్ట్ర గౌడ సంఘాల నాయకులు, సొసైటీల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గీతవృత్తిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, సంప్రదాయ ఔషధం, ఆరోగ్య ప్రదాయిని నీరాను అందించాలనే లక్ష్యంతో రాష్టవ్యాప్తంగా ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో నాలుగు కోట్ల తాటి, ఈత, గిరక మొక్కలను నాటామని పేర్కొన్నారు. గౌడ సామాజిక వర్గం ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు వైన్‌షాపుల్లో 15 శాతం రిజర్వేషన్లు, గీత వృత్తిదారులు ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొందినా, మరణించినా ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్, కూన వెంకటేశ్‌గౌడ్, అయిలి వెంకన్నగౌడ్, కూరేళ్ల వేములయ్యగౌడ్, ప్రశాంత్‌గౌడ్, రమణగౌడ్, అంబాల నారాయణగౌడ్, ఆంజనేయగౌడ్, దాస్‌గౌడ్, శ్రీనివాస్, నవీన్, మల్లికార్జున్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

