హైదరాబాద్ : పల్లె ప్రగతి ఫలాలు మన కండ్ల ముందే సాక్షాత్కారం అవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇప్పటికే పలుచోట్ల చోటుచేసుకున్న అనుభవాలు మన దృష్టికి రాగా తాజాగా రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం దేవునిరవల్లి గ్రామంలో ప్రల్లె ప్రగతిలో భాగంగా నాటిన జామ పండ్ల మొక్కలు కాతకు వచ్చాయి. ఈ ఫలప్రదంపై ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చూడటానికి ఎంత అందంగా ఉంది ఈ దృశ్యం. మీరు ఒక విత్తనాన్ని లేదా మొక్కను నాటండి. మిగతా ఫలం దానంతట అదే వస్తుందని పేర్కొన్నారు.
How cute is this? You just have to sow a seed or plant a sapling. Rest is assured. Happy to see this miniature guava, should I say tree or just a plant, offers it’s fruits for us in a #PallePragathi in Devuniravally, Chevella Mandal of RR dist. #GreenIndiaChallenge 🌱 pic.twitter.com/DL8dkU5w3X
— Santosh Kumar J (@MPsantoshtrs) July 7, 2021