మద్దూరు (ధూళిమిట్ట), అక్టోబర్ 13: అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే తమ మద్దతు ఉంటుందని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం కుల పెద్దలు ప్రకటించారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ పత్రాన్ని శుక్రవారం రాత్రి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అందజేశారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. తనకు మద్దతుగా తీర్మానం చేసిన ధూళిమిట్ట ముదిరాజ్ కుల సంఘానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.