Janagama rural | రైతులందరు ఐకేపీ కేంద్రాలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
Janagama rural | ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
జనగామ రూరల్, ఏప్రిల్ 09 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం జనగామ మండలంలోని పెంబర్తి, వడ్లకొండ, ఎర్ర గొల్ల పహాడ్, అడవి కేశవాపురం గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం అమ్మకాలలో సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. రైతుల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.
మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామ న్నారు. రైతుల ధాన్యం అమ్మిన తర్వాత చెల్లింపులు ఆలస్యమైతే త్వరగా జమ చేయిస్తానని , ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ధాన్యం అమ్మకాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పాత బకాయిలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండున్నరేళ్లుగా రైతుల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. మిల్లర్లు ఇబ్బందులు పెడితే కచ్చితంగా వారితో మాట్లాడి పరిష్కరి స్తానని స్పష్టం చేసారు. జనగామ నియోజకవర్గంలోని ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యతగా తీసుకుం టానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, సర్పంచులు చిన్నబోయిన రేఖ, కాయిదాపురం మహేందర్ రెడ్డి, చిర్ర సత్యనారాయణరెడ్డి, భూ రెడ్డి చైతన్య ప్రమోద్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్డే సిద్ధి లింగం, నాయకులు బైరగోని యాదగిరి గౌడ్, చంద్రం గౌడ్, సీఈవో భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ చిర శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

