కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్
ఎల్ నినో కరువు పరిస్థితులు. బీఆర్ఎస్ శ్రేణుల అవిశ్రాంత పోరాటం. వెరసి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరచినట్టున్నది. నీళ్లన్నీ పోయాక ఇప్పుడు పాలమూరు పంపులను ఆన్ చేసేందు కు పూనుకుంటున్నది. అది కూడా మూడు రోజులుగా ఊరిస్తున్నది. పంపులను తిప్పేందుకు మంత్రి రాకకోసం ఎదురుచూస్తున్నది. అయితే నార్లాపూర్‌కు ఎత్తిపోసినా ఒనగూరే ప్ర యోజనం అంతంతే.
- పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
- శ్రీశైలం నుంచి నార్లాపూర్‌కు నీటి ఎత్తిపోతలకు ఏర్పాట్లు
- మూడేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
- బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నా 2.5కి.మీ పనులు చేపట్టని వైనం
హైదరాబాద్, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో కరువు పరిస్థితులు. బీఆర్ఎస్ శ్రేణుల అవిశ్రాంత పోరాటం. వెరసి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరచినట్టున్నది. నీళ్లన్నీ పోయాక ఇప్పుడు పాలమూరు పంపులను ఆన్ చేసేందు కు పూనుకుంటున్నది. అది కూడా మూడు రోజులుగా ఊరిస్తున్నది. పంపులను తిప్పేందుకు మంత్రి రాకకోసం ఎదురుచూస్తున్నది. అయితే నార్లాపూర్‌కు ఎత్తిపోసినా ఒనగూరే ప్ర యోజనం అంతంతే. అదే ఇప్పటికీ పాలమూరు ఎత్తిపోతల్లో కేవలం 2.5 కి.మీ. కాలువను పూర్తిచేసి ఉంటే.. ఈ సీజన్లో కరివెన రిజర్వాయర్ వరకూ జలాలను తరలించి నిల్వ చేసుకొనే అవకాశం ఉండేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పను ల్లో వేగం తగ్గింది. నత్తకన్నా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ప్యాకేజీ-3 పనులే ఇందుకు నిదర్శనం. ఈ లిఫ్ట్ స్కీమ్‌లో ప్రధానంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు ఉన్నాయి. శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కావాల్సిన పంప్‌హౌస్‌లు, ప్రధాన కాలువలతోపాటు, నిల్వ కోసం ఆయా రిజర్వాయర్లు సైతం బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు మధ్య ప్యాకేజీ-3లో కేవలం 2.5 కి.మీ. కాలువ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ ఓపెన్ కెనాల్ మొత్తం పొడవు 8.325 కిలోమీటర్లు. కేసీఆర్ హయాంలో దాదాపు 6 కి.మీ. నిర్మాణం పూర్తయింది. కేవలం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి, కొల్లాపూర్ మండలం కుడికిళ్ల మధ్యన 2.5 కి.మీ. ఓపెన్ కెనాల్ తవ్వకం మిగిలి ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ ఈ భాగాన్ని పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం శ్రీశైలం నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్ వరకు కృష్ణా జలాలను ఎత్తిపోసుకొని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. తద్వారా ఆయా రిజర్వాయర్ల పరిధిలోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగడంతోపాటు, నీటికరువును ఎంతో కొంతయినా అధిగమించే పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్యాకేజీ-3 పనులను పెండింగ్‌లోనే పెట్టింది.
వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు..
శ్రీశైలం నుంచి పొరుగున ఏపీ జలాలన్నీ కొల్లగొట్టిన అనంతరం నార్లాపూర్ పంపులను రన్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. కేవలం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, పాలమూరు రైతాంగాన్ని ఏమార్చేందుకే ప్రభుత్వం పంపులను ఆన్‌చేసేందుకు ముందుకు కదిలినట్టు తెలుస్తున్నది. ప్యాకేజీ -3 పనుల్లో జా ప్యంపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీ ఆర్ఎస్ నాయకులు మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. పనులపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే మంత్రులు, మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్వయంగా పాలమూరు ప్రాజెక్టును సందర్శించారు. పనుల పూర్తికి గడువులను ప్రకటించారు. ఆరు నెలల్లోపు పెండింగ్ పనులను పూర్తి చేసి 50 టీఎంసీలు స్టోరేజీ చేస్తామని శపథాలు సైతం చేశారు. అయితే పనుల్లో కదలిక వచ్చినా వేగాన్ని మాత్రం పెంచలేదు. పనులు పూర్తికాలేదు. ఇప్పటికీ 4, 6 కిలోమీటర్ల వద్ద సుమారు లక్ష క్యూబిక్ మీటర్ల బెడ్ వర్క్ మిగిలే ఉన్నది. పనులు ఇలాగే కొనసాగితే ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ప్రభుత్వం ఆ పనులు పూర్తిచేసి ఉంటే నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇదే విషయమై ప్రస్తుతం విమర్శలు వినవస్తున్నాయి.
మంత్రి రాకకోసం ఎదురుచూపులు
శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌కు జలాలను ఎత్తిపోయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. అధికారులు సైతం గత మూడు రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. కానీ పంపులను ఆన్ చేయడమే లేదు. అదేమని ఆరా తీస్తే మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చాకే పంపులు ఆన్ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. తానే స్వయంగా పంపులను ఆన్ చేస్తానని, అప్పటివరకు పంపులను ఆన్ చేయవద్దని స్వయంగా వెల్లడించినట్టు అధికారవర్గాలే చెప్తున్నాయి. ప్రస్తుతం మంత్రి ఢిల్లీలో ఉన్నారు. పంపులను ఆన్ చేయడంలోనూ మంత్రి ప్రచారం కోసం తహతహలాడిపోతుండటం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బుధవారం మంత్రి వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారుల పిలుపుమేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ ఢిల్లీకి వెళ్లారు. ఈ మేరకు జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులతో బుధవారం భేటీ కానున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

