Pakistan | ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఆర్థిక శాఖ వద్ద డబ్బులు లేవని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ పంజాబ్‌లో జరగాల్సిన ప్రాంతీయ ఎన్నికలను వాయిదా వేయాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఖ్వాజా చేసిన వ్యా్ఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొంటూ ఎన్నికల సంఘం పేర్కొంది.
దీన్ని ఇమ్రాన్ ఖాన్ పార్టీ వ్యతిరేకించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో అసెంబ్లీని జనవరిలో రద్దు అయ్యింది. మార్చి 1న అసెంబ్లీని రద్దు చేసిన 90 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులోభాగంగా పంజాబ్‌లో ఏప్రిల్‌లో, పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా ఎన్నికల సంఘం అక్టోబర్‌కు వాయిదా వేసింది. దీనిపై ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించేందుకు డబ్బులు లేవని, ప్రస్తుతం ఎన్నికలు జరగడం పాక్‌లోని పీఎంఎల్ఎన్ ప్రభుత్వానికి ఇష్టంలేదని స్పష్టం చేయడంతో ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.