Bathukamma | మహారాష్ట్రలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ముంబయి ప్రాంతీయ పద్మశాలీ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో దాదర్‌లోని యోగి సభగృహలో శుక్రవారం సంబురాలు జరిపారు. వేడుకలకు ముంబయి నుంచి 25 పద్మశాలి సంఘాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి.. అన్నింటినీ ఒకే చోటకు చేర్చి.. ఉయ్యాల పాటలు పాడుతూ.. పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ బతుకమ్మ ఆడుతూ.. తెలంగాణ సంస్కృతికి చాటారు. వేడుకలకు ముఖ్య అతిథిగా శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య థాకరే, సిద్ధి వినాయక మందిర్ ట్రస్ట్ చైర్మన్ సదానంద సర్వంకర్, మాజీ మంత్రి సచిన్ అహిర్, ముంబయి మాజీ మేయర్ శ్రద్ధ జాదర్ హాజరయ్యారు. మహిళా విభాగం చైర్మన్ కటకం విజయలక్ష్మి అందరికీ స్వాగతం పలుకుతూ.. ఆడపడుచును ఆత్మగౌరవానికి మహిళను అగ్రభాగాన నిలిపి ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. పండుగను ఆనందంగా జరుపుకునేందుకు సహకారం కావాలని కోరారు.
ఈ సందర్భంగా శివసేన నేత ఆదిత్య థాకరే మాట్లాడుతూ తెలుగు వారి ఆశీస్సులతో తాను గెలిచానని.. మీ అండదండలు మాకు ఎప్పుడు కావాలన్నారు. తెలుగు సమాజ్ ప్రజల కోసం అన్నివేళలా తాను తోడుంటానన్నారు. తెలంగాణ సంసృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఈ పండుగను పూజిస్తూ.. ముంబయిలోని తెలుగు మహిళలందరూ కలిసి ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఆనందంగా ఘనంగా కోరుతున్నామని అన్నారు . ఇలానే మీకు మా సహకారం ఉంటుందని ఆదిత్య థాకరే అన్నారు. మహిళా విభాగం చైర్మన్ కటకం విజయలక్ష్మి , వైస్ చైర్మన్ పాపన శారదా, చిట్యాల్ ఉమా, కన్వీనర్ పేర్ల కవిత, జాయింట్ కన్వీనర్ సంఘం వైశాలి, జ్యోతి, కోడురు అరుణ, గంజి భావన, కార్యవర్గ సభ్యులు చిలివెరి జ్యోతి, రవ్వ తులసి, ముసుకుర్ భారతి, గజ్జెల రాజశ్రీ, యాపురం శకుంతల, గాజుల శ్వేత, గోనే అంబిక, ఆడెపు శకుంతల, తుమ్మ లక్ష్మి, అల్వాల్ విజయా, గంగుల రాణి, గాజంగి హరిత, బోద్దుల రమాదేవి, పోట్టవత్తిని రమ్య, గుర్రపు రియా, పెర్ల గీతాంజలి, చెరిపల్లి పరమేశ్వరి, శ్రీపతి సులోచన, పిల్లలమారి సంజన, బడుగు రేఖ, బిట్లింగ్ సుజాతతో పాటు ముంబయిలో ప్రముఖ సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.