హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీవోఎం)గా పద్మజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె 1991 ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన వారని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆమె ఎస్సీఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు.