ఆరు వారాల గడువు ఇవ్వండి
మార్చి 29న అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎథిక్స్ కమిటీని ఆరు వారాల గడువు కోరారు. ఈ మేరకు ఆయన ఎథిక్స్ కమిటీకి శనివారం లేఖ రాశారు.
- అసెంబ్లీలో మార్చి29 ఘటనపై సమగ్ర వివరణకు మరింత సమయం కావాలి
- ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మార్చి 29న అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎథిక్స్ కమిటీని ఆరు వారాల గడువు కోరారు. ఈ మేరకు ఆయన ఎథిక్స్ కమిటీకి శనివారం లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఈ నెల 5లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తనకు తగినంత సమయం అవసరమని తెలిపారు. కమిటీ అందించిన మెటీరియల్ పరిమాణం కూడా ఎకువగా ఉన్నదని, దానిని పూర్తిగా పరిశీలించి సమగ్రంగా స్పందించేందుకు మరింత సమయం కావాలని ఆయన కోరారు.
ఘటనకు సంబంధించి కమిటీ అందించిన వీడియో క్లిప్ పూర్తిస్థాయిలో లేదని కౌశిక్‌రెడ్డి లేఖలో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన పూర్తి వీడియోను అందించాలని కోరారు. ప్రత్యేకంగా ట్రెజరీ బెంచ్, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన మొత్తం సంభాషణకు సంబంధించిన వీడియోను ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. తనపై వచ్చిన అంశాలపై స్పందించాలంటే అన్ని ఆధారాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని కౌశిక్‌రెడ్డి పేరొన్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై పూర్తి వీడియో పరిశీలించిన అనంతరం, ప్రతి అంశానికి సంబంధించిన వివరాలతో సమగ్ర వివరణ ఇస్తానని ఆయన స్పష్టంచేశారు.
పాలన చేతగాకే డైవర్షన్ డ్రామాలు
- సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి
- బీఆర్ఎస్ నేత గోసుల ధ్వజం
హైదరాబాద్,ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పాలన చేతగాకే సీఎం రేవంత్ డైవర్షన్ డ్రామాలకు దిగారని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. రాష్ర్టాన్ని సాధించి, అద్భుతమైన సంక్షేమ పాలనతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌ను రాజీనామా చేయాలనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 420 హామీలిచ్చి ప్రజలను దగా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలంటూ అధికార పార్టీయే ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు.

సొంత క్యాబినెట్‌లోని మంత్రులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు ఈ రాజకీయ నాటకానికి పూనుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఈ అసమర్థ అధికార పార్టీకి మళ్లీ కేసీఆర్ ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలను కట్టిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేదంటే ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

