Nallagonda | నల్లగొండ : నిరుపేదలకు అధిక వడ్డీ ఆశజూపి కోట్లు కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్న వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి పాల్పడ్డారు. ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి ఏకంగా నిప్పు పెట్టారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాలో వెలుగు చూసింది.
పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాకు చెందిన బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఇటీవల అధిక వడ్డీల ఆశ చూపి.. రూ. 10 కోట్ల వరకు వసూలు చేశాడు. ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా, తప్పించుకు తిరుగుతున్నాడు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. బాలాజీ నాయక్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి తగులబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలాజీ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
10 కోట్లు ఎగ్గొట్టిన వడ్డీ వ్యాపారి ఇంటి పై బాధితుల దాడి
నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాలో ఇటీవల అధికవడ్డీల ఆశ చూపి భాదితులకు మొండిచేయి చూపించి 10 కోట్ల మేర ఎగ్గొట్టి తిరుగుతున్న బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి ఇంటి పై బాధితుల దాడి
ఫర్నీచర్ ధ్వంసం చేసి… pic.twitter.com/lErWBUiJfc
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2025