హైదరాబాద్,నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మంత్రి పదవి ఆశించానని, కొన్ని సమీకరణాల వల్లే అది నెరవేరలేదని ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో బుధవారం ఉదయం ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన చాంబర్లో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సోనియా, ఖర్గే, రాహుల్, ఏఐసీసీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి,సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సుదర్శన్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.