హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి చెందిన పరిశోధకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి సొంత జర్నల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్’ పేరుతో రూపొందించిన జర్నల్ను మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సోమవారం ఆవిష్కరించారు.
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను సంవత్సరం పొడవునా ఒక్కరికే కేటాయించడం తగదని బీసీ గురుకుల సెక్రటరీకి ఆల్ తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల ఉద్యోగ సంక్షేమ సంఘం(ఎట్గ్రీవ) విజ్ఞప్తి చేసింది.
మూడు నెలలకో ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి కేటాయించాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూకట్ట యాదయ్య, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు.