భువనగిరి: యాదాద్రి భునగిరి జిల్లాలోని వలిగొండలో (Voligonda) కారు బీభత్సం సృష్టించింది. వలిగొండలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మూడు దుకాణాల షెటర్లను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.