గద్వాల: జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి లక్షా 8 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో అధికారులు 23 గేట్లకు ఎత్తివేసి మొత్తం 1,20,358 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో స్పిల్‌వే ద్వారా 89,640 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,267 క్యూసెక్కుల చొప్పున బయటకు వెళ్తున్నది. ఇక నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.080 మీటర్లుగా ఉంది. జలాశయంలో మొత్తం 9.657 టీఎంసీల నీటి నిల్వకుగాను 6.878 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.