కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 13: ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసిందని, ఇక నుంచి దినసరి కూలీల మాదిరి పనిచేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారంతో మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ విధానంలో కరీంనగర్ జిల్లాలో వంద మందికి గా బోధనేతర సిబ్బంది తొమ్మిదేండ్లుగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్ర స్తుత సర్కార్ తమను దినసరి వేతనంపై పనిచేయాలనడంపై మండిపడ్డా రు.