ఆదిలాబాద్ : లంచం తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ ఏఈ శ్రీకాంత్ ఏసీబీ( ACB) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..ఆదిలాబాద్ జిల్లా నార్నూర్(Narnoor) మండలంలోని హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఏఈగా పనిచేస్తున్న శ్రీకాంత్ రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. నార్నూర్‌లోని ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన ఫొటోలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి ఏఈ శ్రీకాంత్ లబ్ధిదారుల వద్ద నుంచి రూపాయలు 20,000 డిమాండ్ చేశాడు.
దీంతో లబ్ధిదారులు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితున్ని ఏసీబీ కరీంనగర్ కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.