దుండిగల్, ఆగస్టు17: అసత్య ప్రచారం, అబద్ధపు మాటల పునాదులపైనే కాంగ్రెస్ రాష్ట్రంలో గద్దెనెక్కిందని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ ధ్వజమెత్తారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గండిమైసమ్మ చౌరస్తాలోని బౌరంపేట సహకార సంఘం బ్యాంక్ వద్ద రైతు రుణమాఫీ కాని వందలాది మంది బౌరంపేట్, దుండిగల్ గ్రామాల రైతులు శనివారం ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గండిమైసమ్మ-దుండిగల్ మండలంలోని బౌరంపేట, దుండిగల్ బ్యాంక్‌లో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మందికి రూ4.30 లక్షలను మాత్రమే ప్ర భుత్వం రుణమాఫీ చేసిందని విమర్శించారు. మిగతా 618 మంది రైతులకు రూ.2.95 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పను లు, వరినాట్లు పూర్తయినా ఇప్పటివరకు రైతుభరోసా ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ విద్దెల బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, డైరెక్టర్లు భీమ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జీతయ్య, కృష్ణ, సత్తిరెడ్డి, ఈ శ్రీనివాస్, పాల్గొన్నారు.