హైదరాబాద్: ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర సర్కారు తీసుకువస్తోంది. అయితే ఆ ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కింది. తాజాగా జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రతిపాదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని 2017లోనే ప్రతిపాదన చేశారని, ఆ సమయంలో ప్రధాని మోదీ.. అఖిల పక్ష సమావేశం నిర్వహించారని, ఆ మీటింగ్కు హాజరై ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తు చేశారు.
అయితే మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన వచ్చిందని, దీనికి క్యాబినెట్ ఆమోదం దక్కినట్లు తెలుస్తోందని, మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని, అయితే ఆ బిల్లు ఏ రూపంలో ఉందన్న అంశంపై క్లారిటీ లేదని కేటీఆర్ అన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ఏ రూపంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందో చూడాలని, బిల్లుపై సమగ్ర విశ్లేషణ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత దానిపై పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
ప్రాంతీయ పార్టీల గురించి బిల్లులో ఎటువంటి అంశాలను పొందుపరిచారో తెలుసుకోవాలని, తమ పార్టీలో దీనిపై చర్చ జరిగిన తర్వాతే తుది నిర్ణయం వెల్లడిస్తామని కేటీఆర్ అన్నారు.
#WATCH | Hyderabad | On One Nation One Election, BRS Party Working President KT Rama Rao says, “Back in 2017 when this proposal had been mooted, the PM had called an all-party meeting. We had expressed our support back then. But 7 years later, when the One Nation One Election… pic.twitter.com/yfovOEGvBA
— ANI (@ANI) December 12, 2024