శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 27, 2020 , 16:02:50

'పెండ్లి కానుకను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే'

'పెండ్లి కానుకను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే'

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : పెండ్లి కానుకగా రూ. 1,00,116 ఇస్తున ఏకైక ప్రభుత్వం మన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ మండల పరిధిలో మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను 92 మంది లబ్దిదారులకు మంత్రి ఈ రోజు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. పుట్టిన శిశువులకు కేసీఆర్‌ కిట్‌ అందజేయడం మొదలుకొని ఆడపిల్ల పెళ్లి చేసేవరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ దీపికా, వైస్‌ చైర్మన్‌ రమేష్‌, అడిషనల్‌ కలెక్టర్‌ జాన్‌ శాంసన్‌, కమిషనర్‌ సత్యనారాయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. logo