OU students : ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను విద్యార్థులు నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినదించారు. విద్యార్థులంతా కలిసి ఆయనను ముట్టడించారు. ఎన్నికల సందర్భంగా ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నదని ప్రశ్నించారు.
అయితే విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక వెంకట్ అక్కడి నుంచి జారుకున్నారు. సమాధానం చెప్పాలని విద్యార్థులు నిలదీస్తున్నా వినిపించుకోకుండా కారెక్కి పారిపోయారు. దాంతో విద్యార్థులు ‘దొంగ దొంగ.. వెంకట్ దొంగ’ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డికి కూడా విద్యార్థుల నిరసన సెగ తగిలింది. బల్మూరి వెంకట్‌ను విద్యార్థులు ముట్టడించి, నిలదీసిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
ఓయూలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను నిలదీసిన విద్యార్థులు
రేవంత్ రెడ్డిని తరిమిన తర్వాత కనిపించిన బల్మూరి వెంకట్
దీంతో బల్మూరి వెంకట్‌ను ముట్టడించి జాబ్ క్యాలెండర్‌పై నిలదీసిన విద్యార్థులు
విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తలదించుకుని పారిపోయిన బల్మూరి వెంకట్ https://t.co/JLWv3NJLgU pic.twitter.com/I1FYfxoFFa
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2025