Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం సరికొత్త చరిత్రను సృష్టించింది. విభాగం విద్యార్థుల్లో 90 శాతం మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో ఉద్యోగాలు సాధించారు. క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలలో అత్యధికంగా ఫెడరల్ బ్యాంకు ఒక విద్యార్థికి రూ. 16 లక్షల వార్షిక వేతనం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరో విద్యార్థికి రూ. 8 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు అందజేశాయి. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను వర్సిటీ ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్, విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్, డీన్ ప్రొఫెసర్ శ్రీరాములు, బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ స్మిత సాంబ్రాణి, డాక్టర్ విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.