Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాస్తారోకో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తక్షణమే 15 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల ఆందోళనకు వ్యతిరేకంగా ఓయూలో జారీచేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉంటే మాత్రం ఈ డిమాండ్‌తోనే గురువారం ఓయూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యూ, పిడిఎస్యూ విజృంభణ, పిఎస్యూ, ఏఐడీఎస్ఓ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.