హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఒక పరీక్షలో ఒకటో రెండో ప్రశ్నలు తప్పుగా రావడం, వాటికి మార్కులు కలపడం సహ జం. కానీ, వందేండ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్(సెట్) చరిత్ర పేపర్లో ఏకంగా 39 ప్రశ్నలు తప్పుగా ఇవ్వడం గమనార్హం. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు 50 మార్కులు కలపాల్సి వచ్చింది. 2024 సెప్టెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీ సెట్ పరీక్షలను నిర్వహించింది. సెప్టెంబర్ 10న చరిత్రకు సంబంధించి రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహించి ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యంతరాలు స్వీకరించగా మొత్తం 39 ప్రశ్నలు తప్పుగా ఉన్నట్టు తేలింది.