Protest : ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిరసన సెగ తగలింది. సీఎం వాహనం క్యాంపస్‌లోకి ప్రవేశించగానే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం సొంతంగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు.
విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి తన వాహనంపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. ఇదిలావుంటే సీఎం ఓయూ సందర్శన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడే బారీకేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను కట్టడి చేశారు. కాగా సీఎంకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డికి నిరసన సెగ
సీఎం డౌన్ డౌన్ అంటూ వెంటపడి తరిమిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు pic.twitter.com/rjgaK81Jfa
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2025